Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భూమా నాగిరెడ్డి అరెస్ట్... నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలింపు

వైసీపీ నేత, శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను పోలీసు వాహనంలో నంద్యాల పట్టణ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం జరిగిన పోలింగ్ సందర్భంగా పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించారంటూ ఆయనపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే తమ విధులకు అడ్డుతగిలారంటూ పోలీసులు ఫిర్యాదు చేశారు. తనను టచ్ చేయవద్దంటూ భూమా పొగరుగా వ్యవహరించారని డీఎస్పీ దేవదానం పేర్కొన్నారు. అంతకుముందు, నంద్యాలలో పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన నాగిరెడ్డి తనయ, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియను పోలీసులు వెళ్లిపోవాలని కోరారు. ఆ సందర్భంగా ఆమెకు, పోలీసులకు మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న నాగిరెడ్డి అక్కడికి చేరుకుని, తన కుమార్తెను వెళ్లమని చెప్పడానికి మీరెవరంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు.

More Telugu News